:::: MENU ::::

Monday, March 6, 2017

In 1940, archaeologist M.S. Vats discovered three Shiva Lingas at Harappa, dating more than 5,000 years old. This rare archival photo shows that ancient Shiva Linga as it was being excavated from the Harappa site.






Sunday, March 5, 2017

Sunday, February 26, 2017













అమ్మవారి అష్టాదశ పీఠాల స్తోత్రాన్ని వినేటప్పుడు ‘కాష్మీరేతు సరస్వతీ’ అన్న మాట వినిపిస్తుంది. మరి ఆ సరస్వతీ దేవి ఆలయం ఎక్కడ ఉన్నట్లు! అది ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది? అంటే వినిపించే జవాబులు కాస్త బాధని కలిగించక మానవు.
దక్షయజ్ఞం తరువాత సతీదేవి శరీర భాగాలు భారతదేశమంతటా పడ్డాయనీ, వాటినే అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుచుకుంటామనీ తెలిసిందే! వాటిలో అమ్మవారి కుడిచేయి కశ్మీరంలో పడిందని చెబుతారు. అక్కడ వెలసిన అమ్మవారిని శారదాదేవిగా కొలుచుకుంటారు. ఇలా కశ్మీరులో వెలసిన అమ్మవారిని దర్శించేందుకు దేశవిదేశాల నుంచి వేల మంది యాత్రికులు వ్యయప్రయాలసను ఓర్చి చేరుకునేవారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన రామానుజాచార్యులు మొదలుకొని, చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ వరకూ ఇక్కడి ఆలయాన్ని దర్శించినట్లు చెబుతారు. ఇక కల్హణుడు వంటి పండితులు రాసిన వందల ఏళ్లనాటి గ్రంథాలలో ఈ కశ్మీర సరస్వతి ప్రస్తావన తప్పకుండా కనిపిస్తుంది. శంకరాచార్యులవారి స్తోత్రాలలోనూ అమ్మవారి స్తుతి వినిపిస్తుంది.

బారాముల్లాకి 50 కిలోమీటర్ల దూరంలో నీలం నదీ తీరాన, నీలం లోయలో ఈ సరస్వతీ ఆలయం ఉంది. శారదా, నారది అనే రెండు పర్వత శిఖరాలు ఈ ఆలయంలోని అమ్మవారికి తలవంచుతున్నట్లుగా కనిపిస్తాయి. దాంతో ఇటు భక్తులతో పాటుగా అటు ప్రకృతి కూడా అమ్మని కొలుచుకుంటున్నట్లుగా తోస్తుంది. ఒకప్పుడు ఈ ఆలయనికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. శారదా దేవి అంటేనే జ్ఞానానికి అధిపతి కాబట్టి, ఆ అమ్మ చెంతనే ఉండి వేదాధ్యయనం చేసేందుకు పండితులు ఉత్సాహపడేవారు. అలా ఇక్కడ వేదాధ్యయనం చేసేందుకు ఏకంగా ఒక విశ్వవిద్యాలయమే ఉండేది. ఆ విశ్వవిద్యాలయం పేరు మీదుగానే ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి శారదా పీఠం అన్న పేరు స్థిరపడిపోయింది.

కేవలం జ్ఞానార్థులే కాదు గ్రంథ రచయితలు కూడా అమ్మవారి అనుగ్రహం కోసం శారదా పీఠానికి చేరుకునేవారు. అక్కడ అమ్మవారి విగ్రహం ముందర తమ గ్రంథాలను రాత్రివేళల్లో ఉంచేవారు. ఉదయం ఆలయం తలుపులు తెరిచేసరికి ఆ విగ్రహం ముందర ఉన్న తాళపత్రాలు కనుక కదలకుండా ఉంటే, వాటి మీద అమ్మవారి అనుగ్రహం ఉన్నదనీ... అలా కాకుండా తాళపత్రాలన్నీ చెల్లాచెదురైపోయి ఉంటే అమ్మవారికి అందులోని సారం తృప్తి కలిగించలేదనీ భావించేవారట. జ్ఞానపరంగా, భక్తిపరంగా శారదాపీఠానికి ఇంత మహత్తు ఉండబట్టే ఒకప్పుడు కాశ్మీరం యావత్తూ ‘శారదాదేశం’గా పిలవబడేది. వేల సంఖ్యలో కాశ్మీరీ పండితులు ఇక్కడ స్థిరనివాసాన్ని ఏర్పరుచుకునేవారు. ఇక్కడ అమ్మవారి పేరు మీదుగా ఏకంగా ‘శారదా లిపి’ అనే లిపిని కనుగొన్నారంటే... ఇక్కడి శారదా అమ్మవారిని ప్రజలు ఎంతగా గౌరవించేవారో తెలుస్తుంది.

ఇదంతా గతం! ప్రస్తుతం ఈ ఆలయం వద్ద శిథిలాలు తప్ప మరేవీ లేవు. వందల ఏళ్లుగా శత్రు రాజుల దాడిలో ఇక్కడి ఆలయం ఇంచుమించుగా ధ్వంసమైపోయింది. స్థానిక రాజులు ఎప్పటికప్పుడు ఆలయాన్ని పునర్నిర్మించేవారు కానీ.... 1948 నాటికి పరిస్థితులు దిగజారిపోయాయి. 1948లో భారత, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ ప్రాంతం పాకిస్తాన్‌ ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఆనాటి నుంచి కూడా పాక్‌ ఆక్రమిత కశ్మీరంలో భాగంగా ఈ ఆలయం మిగిలిపోయింది. ఇక్కడ నివాసం ఉన్న కశ్మీరీ పండితులు తరిమివేయబడ్డారు. మిగిలిన కొద్ది మంది చేతా బలవంతంగా మతం మార్పించేశారు.
అసలే శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయం 2005లో వచ్చిన భూకంపంతో మరింతగా దెబ్బతినిపోయింది. ప్రస్తుతానికి ఇక్కడ ఒకప్పటి భవనాల తాలూకు మొండిగోడలు మాత్రమే మిగిలాయి. ఇక అమ్మవారి విగ్రహం అయితే ఏనాడో అదృశ్యమయిపోయింది. శివలింగాన్ని తలపించే ఓ ఆరడగుల రాయి మాత్రమే మిగిలింది. ఆలయంలో ఏమున్నా లేకపోయినా ఇక్కడి స్థలమహత్యం కారణంగా శారదాపీఠాన్ని చేరుకునేందుకు భక్తులు ఉత్సాహపడుతూనే ఉంటారు. కానీ దురదృష్టవశాత్తూ పాకిస్తాన్‌ సైన్యం ఇక్కడికి యాత్రికులను ఎవ్వరినీ అనుమతించడంలేదు.


Friday, December 16, 2016









1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి
జ. గోరు వెచ్చనివి.
2.నీరు త్రాగేవిధానము
జ. క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.
3.ఆహరం ఎన్ని సార్లు నమలాలి
జ.32 సార్లు.
4. భోజనం నిండుగ ఎప్పుడు తినాలి
జ. ఉదయం.
5. ఉదయం ఎన్ని గంటలలోపు టిఫిన్ తినాలి
జ. సూర్యోదయం అయ్ న 2.30 గం" లోపు.
6.ఉదయం పూట టిఫిన్ తో ఏమి త్రాగాలి
జ. ఫల రసాలు(fruit juice).
7. మధ్యానము భోజనం తర్వాత ఏమిత్రాగాలి
జ. లస్సీ, మజ్జిగ.
8. రాత్రి భోజనం తో ఏమి త్రాగాలి
జ. పాలు.
9. పుల్లటి ఫలములు ఎప్పుటు తినకూడదు
జ. రాత్రి.
10. ఐస్ క్రీం ఎప్పుడు తినాలి
జ. ఎప్పుడూ తినకూడదు.
11.ఫ్రిజ్ లోంచి తీసిన పదార్దాలు ఎంత సేపటికి తినవలెను
జ. గంట తర్వాత.
12. శీతల పానియాలు త్రాగవచ్చున( cool drink )
జ. త్రాగకూడదు.
13. వండిన వంటలను ఎంత సేపటిలో తినాలి
జ. 40 ని.
14.రాత్రి పూట ఎంత తినాలి
జ. చాలా తక్కువగా, అసలు తిననట్టు.
15. రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలి
జ. సూర్యాస్తమయం లోపు.
16. మంచినీళ్ళు భోజనానికి ఎంత ముందు త్రాగాలి
జ. 48 ని.
17. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగవచ్చునా
జ. త్రాగకూడదు.
18. ఉదయం టిఫిన్ తిన్నాక ఏమిచేయాలి
జ. పని.
19.మధ్యాహ్నం భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. విశ్రాంతి తీసుకోవాలి.
20.రాత్రి భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. 500 అడుగులు నడవాలి.
21. అన్ని వేళలా భోజనం చేసిన తర్వాత ఏమి చేయాలి
జ. వజ్రాసనం వేయాలి.
22. వజ్రాసనం ఎంత సేపు వేయాలి
జ. 5 - 10 ని.
23. ఉదయం లేచిన తర్వాత కళ్ళలో ఏమి వేయాలి
జ. లాలాజలం,( saliva ).
24. రాత్రి ఎన్నింటికి పడుకోవాలి
జ. 9 - 10 గం.
25. 3 విషముల పేర్లు
జ. పంచదార, మైదా, తెల్లటి ఉప్పు.
26. మధ్యాన్నం తినే కూరల్లో ఏమి వేసి తినాలి
జ. వాము.
27. రాత్రి పూట సలాడ్ తినవచ్చునా
జ. తినరాదు.
28. ఎల్లప్పుడూ భోజనం ఎలా చేయాలి
జ. క్రింద కూర్చుని మరియు బాగా నమిలి .
29. విదేశీ వస్తువులను కోనవచ్చునా
జ. ఎప్పుడూ కోనరాదు (Buy) .‌
30. టీ ఎప్పుడు త్రాగాలి
జ. అసలు ఎప్పుడు త్రాగకూడదు.
31. పాలలో ఏమి వేసుకుని త్రగాలి
జ. పసుపు.
32. పాలలో పసుపు వేసుకోని ఎందుకు త్రాగాలి
జ. క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది.
33. ఏ చికిత్సా విధానం మంచిది
జ. ఆయుర్వేదం.
34. వెండి, బంగారు పాత్రల్లో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో).
35. రాగి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. జూన్ నుంచి సెప్ట్ంబర్ ( వర్షాకాలంలో).
36. మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. మార్చ్ నుంచి జూన్ ( ఎండాకాలంలో).
37. ఉదయం పూట మంచినీరు ఎంత తీసుకోవాలి
జ. సుమారు 2,3 గ్లాసులు.
38. ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేవాలి
జ. సూర్యోదయాని 1.30 ముందుగా.
మిత్రులారా ఈ post నచ్చితే share చేయటం మర్చిపోకండి.

Thursday, December 15, 2016



మన బాడీలోపలఏయే టైం లోఏం జరుగుతుందో తెలిస్తే , ఖచ్చితంగాఆశ్చర్యపోతారు
మనం ఏ పని చేసినా దానికిఒక టైం అంటూ ఉంటుంది. కానీమన శరీరం కూడాఒక నిర్దిష్టమైన సమయాన్ని పాటిస్తుందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. మన శరీరం కూడాతనలో జరిగే జీవ- క్రియలకు ఒక్కో సమయాన్ని కేటాయిస్తుంది. ఆ సమయంలో ఆయాఅవయవాలుయాక్టివ్గా పనిచేస్తాయి. దీని వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మన శరీర అవయవాలు యాక్టివ్ గాఉన్న సమయంలో వాటికివిరుద్ధంగా మనం చేసే కొన్ని పనుల వల్ల ఆయాభాగాలపైఒత్తిడి పెరిగి మనకు అనారోగ్యం కలగుతుంది. ఈ క్రమంలో అసలు ఏయే భాగాలుఏయే సమయాల్లో యాక్టివ్గా పనిచేస్తాయో, అవి పని చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఉదయం 5 నుంచి 7 గంటల మధ్య – ఈ సమయంలో పెద్ద పేగు యాక్టివ్గా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపే పనిలో అది మునిగి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం ఎంత వీలైతే అంత ఎక్కువగా నీటిని తాగాలి.వాకింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. కాఫీ,టీ వంటివి అస్సలు తాగకూడదు. ఉదయం 7 నుంచి 9 మధ్య – ప్రోటీన్లు, తక్కువ పిండి పదార్థాలు కలిగిన ఆహారం, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాన్ని, పండ్లను ఈ సమయంలో బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి.దీని వల్ల మన శరీరానికికావల్సిన పోషకాలుఎక్కువగా ఉదయమే అందుతాయి. ఉదయం 9 నుంచి 11 మధ్య – ఈ సమయంలో మన శరీరంలోనిప్లీహం ఉత్తేజంగా ఉంటుంది. అది మన శరరీంలో జరిగే జీవక్రియలను గాడిలోపెడుతుంది. ఉదయం మనం తిన్న ఆహారం నుంచి పోషకాలనుశరీరం గ్రహించేలా చేస్తుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య – ఈ సమయంలో మన గుండె ఉత్తేజంగా పనిచేస్తుంది. శరీర భాగాలకురక్తం బాగా సరఫరాఅయ్యేలా చూస్తుంది. దీని వల్ల శరీర కణాలకు శక్తి అందు తుంది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు – ఈ సమయంలో చిన్న పేగులు అలర్ట్గా ఉండి బాగా పనిచేస్తాయి. మనం తిన్న బ్రేక్ఫాస్ట్, లంచ్ల జీర్ణప్రక్రియను ముగిస్తుంటాయి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు – ఈ సమయంలో మన మూత్రాశయం యాక్టివ్గా పనిచేస్తుంది. శరీరంలోనివ్యర్థాలను బయటకి పంపే పనిలోఉంటుంది. ఈ సమయంలో నీరు ఎక్కువగా తాగాలి. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు – ఈ సమయంలోనూ మన కిడ్నీలు బాగా చురుగ్గా పనిచేస్తాయి. రక్తాన్ని వడబోయడం, వ్యర్థాలను మూత్రాశయానికి పంపడం వంటి కార్యక్రమాలను చేస్తాయి. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య – ఈ సమయంలో పెరికార్డియం ఉత్తేజంగా ఉంటుంది. ఈ టైంలో రాత్రి భోజనాన్నికచ్చితంగా ముగించాలి. మెదడు, ప్రత్యుత్పత్తి అవయవాలను పెరికార్డియం ఈ సమయంలో యాక్టివేట్ చేస్తుంది. రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య – ఈ సమయంలో భోజనం అస్సలు చేయకూడదు. థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు ఇప్పుడు బాగా పనిచేస్తాయి. ఇవి శరీర మెటబాలిజం ప్రక్రియను చురుగ్గా సాగేలాచేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తాయి. కణాలకుశక్తి అందేలాచూస్తాయి. రాత్రి 11 నుంచి 1 గంట మధ్య – ఈ సమయంలో మూత్రాశయం యాక్టివ్గా ఉంటుంది. గాల్స్టోన్స్ వంటివి ఉన్నవారికి ఈ సమయంలో సాధారణంగా నొప్పి వస్తుంటుంది. రాత్రి 1 నుంచి ఉదయం 3 మధ్య – ఈ సమయంలో కాలేయంచురుగ్గా ఉంటుంది. అప్పుడు మేల్కొని ఉంటే లివర్ పనితనం దెబ్బతింటుంది. కాబట్టి ఈ సమయంలో కచ్చితంగా నిద్రపోవాల్సిందే. లేదంటే కాలేయంసరిగ్గా పనిచేయదు. వ్యర్థాలు బయటికి వెళ్లవు. ఉదయం 3 నుంచి 5 మధ్య – ఈ టైంలో ఊపిరితిత్తులు యాక్టివ్గా ఉంటాయి. ఆ సమయంలో దగ్గు వస్తుందంటే ఊపిరితిత్తులు విష పదార్థాలను బయటకు పంపుతున్నాయని అర్థం చేసుకోవాలి
.
A call-to-action text Contact us