:::: MENU ::::

Monday, October 24, 2016




 పూర్వపు రికార్డ్లు చెరిపేస్తూ అంతకంతకీ ముందుకు మరింతగా దూసుకుపోతూ 2015లో గరిష్ఠంగా కార్బన్డైఆక్సైడ్ అణువులు 400 పిపియం లకు  చేరుకున్నాయి. అంటే పది లక్షల అణువుల్లో 400కార్బన్ డై ఆక్సైడ్ కు చెందినవ అణువులే ఉన్నాయి. ప్రస్తుతం అంటే ఈ 2106లో కూడా వీటి పరిమాణం ఇలాగె కొనసాగే అవకాశం ఉంది. ఫలితంగా మనం తక్షణమే చర్యలు తీసుకున్నా కొన్ని తరాలవరకు వీటి దుష్ప్రభావం వెంటాడే ప్రమాదం ఉంది. ఈ వివరాలతో ప్రపంచ వాతావరణ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. కార్బన్ డై ఆక్సైడ్ విజృంభణ కు కొంతవరకు ఎల్ ని నొనె కారణమని నిపుణులు భావిస్తున్నారు. 2014, 2015 మధ్యకాలంలో మానవుల వలన విడుదలైన కార్బన్ ఉద్గాతాలు దాదాపు స్థిరంగా ఉండడంతోనే వారు ఈ అభిప్రాయానికి వచ్చారు. ఎల్ నినో వాతావరణంలోని వాయువుల పరిణామాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే సంగతి తెలిసిందే. తాజా కర్బన స్థాయిలను హవాయిలో మౌనాలోవ వాతావరణ పర్యవేక్షణ కేంద్రం నిర్ణయించింది. పారిశ్రామీకరణకు మునుపటితో పోలిస్తే మిథేల్ నెట్రస్ ఆక్సైడ్ లాంటి మఱికొన్ని గ్రీన్ హౌస్ వాయువులూ వాతావరణంలో క్రమంగా పెరుగుతున్నట్లు డబ్ల్యూఎం లో వెల్లడించింది. పారిశ్రామికీకరణకు మునుపటితో పోలిస్తే మిథేల్ 2.5రెట్లు పెరిగినట్లు తెలిపింది. పారిశ్రామిక వ్యవసాయం, గృహ సముదాయాల నుంచి వెలువడుతున్న వీటివల్ల 1920 నుంచి 2015 మధ్యకాలంలో భూతప ముప్పు 37%పెరిగినట్లు వివరించింది..

0 comments:

Post a Comment

A call-to-action text Contact us