నాల్గవరోజు అమ్మవారి అలంకారము : అన్నపూర్ణాదేవి.
"ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"
దసరా ఉత్సవాలలో అమ్మవారిని నాల్గవ రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ. అన్నపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆది భిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయ స్ఫూర్పి, వాక్ సిద్ది, శుద్ధి, భక్తీ శ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. సర్వ లోకాల పోషకురాలు "అమ్మ" అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుంది.
అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. "హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి నైవేద్యంగా దధ్ధోజనం, పొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేయాలి.
నైవేద్యం - దధ్ధోజనం,పొంగలి.
దసరా మహోత్సవములు – 2016
ది:1-10-2016 శనివారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి (స్వర్ణ కవచం)
ది:2-10-2016 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి (లేత పింక్ రంగు చీర)
ది:3-10-2016 సోమవారము ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ది) శ్రీ గాయత్రి దేవి (ఆరెంజ్ కలర్ చీర)
ది:4-10-2016 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ అన్నపూర్ణా దేవి (గంధపు పసుపు రంగు చీర)
ది:5-10-2016 బుధవారము ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ కాత్యాయని దేవి (నీలం రంగు చీర)
ది:6-10-2016 గురువారము ఆశ్వయుజ శుద్ధ పంచమి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి (ప్యూర్ గోల్డ్ జరీ)
ది:7-10-2016 శుక్రవారము ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శ్రీ మహాలక్ష్మిదేవి (పింక్ నిండు చీర)
ది:8-10-2016 శనివారము ఆశ్వయుజ శుద్ధ సప్తమి శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) (తెలుపు రంగు చీర)
ది:9-10-2016 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) శ్రీ దుర్గా దేవి (నిండు ఎరుపు రంగు చీర)
ది:10-10-2016 సోమవారము ఆశ్వయుజ శుద్ధ నవమి(మహర్నవమి) శ్రీ మహిషాసురమర్ధినీ (బ్రౌన్ / ఎరుపు కలనేత జరీ చీర)
ది:11-10-2016 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ దశమి(విజయదశమి) శ్రీ రాజరాజేశ్వరి దేవి పచ్చ రంగు చీర
Indonasia ...
Nepal
Tibet
Tibet
jquery image gallery
image slider jquery 
0 comments:
Post a Comment