నాకొక చిన్న సందేహం.. మీరే చెప్పాలి.
చైనా వస్తువులు నిషేదించమని ప్రచారం చేస్తున్నారు బాగానే ఉంది. కానీ సాధ్యమేనా? ఎందుకంటే లేచింది మొదలు మొబైల్ లో ముఖం పెట్టి పడుకునే వరకు మనం వాడే వస్తువులలో దాదాపు చైనా నుండే దిగుమతి చేసుకునేవే.. ప్లాస్టిక్ దగ్గర నుండి ఫోన్లు, ఏసీ, వాషింగ్ మిషన్ ల వరకు దాదాపుగా అన్ని చైనా నుండే దిగుమతి చేసుకుంటున్నాం. జీవితంలో చైనా ఒక భాగం అయిపొయింది.
ఇది అది అని లేకుండా ప్రతీది ప్లాస్టిక్ మయమే కదా! రాగి చెంబు వాడండి అంటే ఎవడు వింటున్నాడు? ఏసీలు ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి అంటే ఎవడు వింటున్నాడు? వాషింగ్ మిషిన్ వాడకుండా స్వయంగా ఉతకండి, దేహానికి వ్యాయామంగా ఉపయోగపడుతుంది అంటే ఎవడు వింటున్నాడు. జనం ఎంతలా మారిపోయారంటే! కూర్చున్న చోటు నుండి కదలకుండా అన్ని పనులు అయిపోవాలి అనేంత బద్దకంతో మూలుగుతున్నారు.. మొబైల్స్ లాప్ టాప్స్ లేకుండా ఈరోజు యువత బ్రతకడం చాలా కష్టం అనేంతగా తయారయ్యారు. రోడ్ల మీద ఏ అమ్మాయిని చూసినా చాటింగో, మీటింగో పెట్టుకొని ఎదురుగా ఏమి వస్తున్నాయో కూడా గమనించకుండా, ఇంటికి బంధువులు వచ్చినా పలకరించకుండా అదో మాయాదారిలోకంలో ఉండిపోతున్నారు. చేతిలో చాటింగ్, మీటింగ్ లేని అమ్మాయిని గాని అబ్బాయిని కానీ ఈమధ్య కాలంలో నేను చూడలేదు.
పాపం ఒకడికి ఒక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయికి సైట్ కొడుతున్నాడు. చెబుదామంటే ముఖం వంకే చూడదే! చాలా ప్రయత్నించాడు పాపం. కనీసం తలెత్తి పైకి చూడడు. దించిన తల ఎత్తదు. బయటే కాదు ఇంట్లో కూడా తలెత్తదు పాపం. అబ్బాయి అంటే ఇష్టం లేకో! అమ్మానాన్నలు అంటే గౌరవమే కాదు. మొబైల్ లో చాటింగ్ మీటింగ్ చేస్తూ తీరిక దొరకడంలేదు. అంతేతప్ప ఎవరిమీద ద్వేషం కాదు గౌరవం కాదు. ఆలా మారిపోయారు యువత..
ఈవిధంగా చైనా వస్తువులు నిత్యం మన జీవితంలో పెనవేసుకొని బంధుత్వాలని బ్రష్టు పట్టిస్తున్న పట్టించుకోనంతగా మారిపోతే ఇంకెలా నిషేదిస్తారు? ఒకవేళ నిషేధించినా ఊరుకుంటారా? పోనీ ఆ ప్రాజెక్ట్స్ మనం తయారు చేసుకునే వీలుందా? లేదు. ప్లాస్టిక్ వస్తువుల నుండి గడియారాలు, చేతి గడియారాలు, బొమ్మలు, టపాసులు, మొబైల్స్, కంప్యూటర్స్, ప్రింటర్స్, జ్యుయలర్స్ వరకు ఇది అది కాదు. మార్కెట్లో ఏది వచ్చినా దానిని కాపీ కొట్టి డూప్లికేట్ తయారు చేసి లక్షరూపాయల విలువైన వస్తువుని 10000 చేసి అమ్ముతుంటే కొనేవారు కోట్లమంది ఉన్నారు.
నిజాయితీగా చెప్పండి చైనా గూడ్స్ మేము నిషేదిస్తాం అని?
నిజాయితీగా నిషేధించాలి అంటే మనం జీవితంలో నిషేధించే పనులు కూడ చాలానే ఉన్నాయి. సోషల్ మీడియాలో నిజాలు మాట్లాడేవారిని వెదకడం చాలా కష్టం. అందరూ పోస్కోలు రాయుళ్లే..
0 comments:
Post a Comment