అడ మగ, పిల్లలు పెద్దలు అనే తేడాపెకాటకి లేకుండా బానిసలవుతున్న తెలుగు రాష్ట్ర ప్రజలు.. రెండు రాష్ట్రాలలో ఆన్లైన్ గేమింగ్ పేరుతొ సాగుతున్న జూదానికి బానిసలవుతున్నవారు సంఖ్యా నానాటికి క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా యువత, విద్యార్థులు, గృహిణులు అలవాటుపడుతున్నారు. జూదం స్థాయి వందలు వేలు దాటి లక్షలు కోట్లలోకి చేరింది. గతేడాది మనదేశంలో ఈ వ్యాపార స్థాయి 2,650కోట్లుగా ఉంటె రాబోయే నాలుగేళ్లలో 5,200 చేరుతుందని పిక్కి అంచనా. అంటే పేకాట ఆడేవారు ఏ స్థాయిలో పెరిగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. చేతిలో మొబైల్ ఉన్నాచాలు తమ ఆన్లైన్ రమ్మి వెబ్సైట్ ద్వారా అదేసుకోవచ్చు. ఊదరగొట్టే ప్రకటనలతో వలలో చిక్కుకుపోతున్నారు. ఆన్లైన్ జూదంలో అలవాటు పడి ఇక అదే లోకమన్నట్లు అందులోనే తలమునకలై ఉండిపోతున్నారు. కుటుంబసభ్యులు, బంధువుల సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఉదయం లేవడంతో మొదలైన ఆట బాత్రూముల్లో, భోజనం దగ్గర, అల్పాహారం దగ్గర, కార్యాలయంలో, ఇంటికి వచ్చాక, పడక గదిలో ఇలా ఇక్కడా అక్కడా అనే తేడ లేకుండా మానవ సంబంధాలకి దూరంగా వెళ్ళిపోతున్నారు. దీనితో పాటు వచ్చీరాని ఆటలు ఆడడంతో ఓడిపోవడం చేత అటు స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర అప్పుల పాలైపోతున్నారు.
Indonasia ...
Nepal
Tibet
Tibet
jquery image gallery
image slider jquery 
0 comments:
Post a Comment