శ్రీవారి బ్రహ్మోత్సవాలు : హంస వాహనం
బ్రహ్మోత్సవంలో రెండోవ రోజు రాత్రి మలయప్ప ఊరేగే వాహనం హంస వాహనం.
వీణాపాణి, చదువులరాణి సరస్వతి సద్గుణ నికురంబగా ప్రశస్తి కేక్కిన శారదాంబకు ప్రతిరూపంగా కల్పించిన రూపమే ఈ హంస వాహనం.హంస పాలలోని నీళ్ళను వదిలి పాలను త్రాగే విధంగా భగవంతుడు పాపాలను క్షమించి వాత్సల్యంతో దగ్గరికి చేరదీస్తాడని చెప్పడం కోసం ఈ హంస వాహనం.పరమహసుడైనవాడు పరమాత్మా.అతడు హంస వాహనం ఫై అనుగ్రహించడం జ్ఞానమార్గానికి తగిన అవధారణను చేకూరుస్తుంది..
సింహ వాహనం..
బ్రహ్మోత్సవం వేళా మూడవరోజు ఉదయం మలయప్ప, యోగనరసింహస్వామి రూపంలో ఊరేగే వాహనం సింహవాహనం
వనరాజు,మృగరాజు సింహం గాంభీర్యానికి దక్షతకు ప్రతిక సింహం దుష్ట శిక్షణలో భాగంగా దుర్మార్గుడైన హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీమహావిష్ణువు ధరించిన అవతారం నరసింహవాతరం.ఈ ఉదంతాన్ని భక్తులకు కనులకు కట్టినట్లు చూపించడాని కోసం సింహవాహన ఉత్సవం నిర్వహిస్తారు. వజ్రకిరీటం,చెవులకు రవ్వలపోగు,శ్రీవత్సం,లక్ష్మి కౌస్తుభం- ఈనాటి అలంకరణలోని ప్రత్యేకత
0 comments:
Post a Comment