:::: MENU ::::

Wednesday, December 14, 2016


మనం మాట్లాడే మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి.
ఒక్క మాట వలన మనస్సు ముక్కలైపోవచ్చు
ఒక్కమాట వలన వంశాలు నిర్మూలనం అయిపోవచ్చు.
ఒక్క మాట వలన దేశాన్ని మార్చవచ్చు.
ఒక్కమాట వలన విరిగిన మనస్సుని అతకవచ్చు.
ఒక్కమాటలో ప్రాణాన్ని నిలపవచ్చు. ఒకే ఒక్కమాట జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే మనస్సుని నియంత్రిస్తే మాట నియంత్రణలో ఉంటుంది.
మందర మాట వినడం వలన కైకేయి మారయిపోయింది.
కైకేయి మాట వలన రాముడు అడవులపాలయ్యాడు.
ఆ ఒక్కరి మాట వలన దశరథుడు మరణించాడు.
ఆ ఒక్కరి మాట వలన అయోధ్య లోని సింహాసనం నందగ్రామం చేరుకుంది. భరతుడు భరతుడితోడి శత్రుఘ్నుడు వెళ్లిపోయారు.
ఆ ఒక్కరి మాట వలన అయోధ్య 14 సంవత్సరాలు కళా విహీనం అయిపొయింది..

ఇక్కడ కూడా సూర్పణక చెప్పిన అబద్దం వలన సీత అపహరించబడింది.
ఆ ఒక్కరి మాట వలన సీతని అపహరించాలి అనే ఆలోచన లేని రావణుడు మారిపోయి సీతాపహరణం చేశాడు.
ఆ ఒక్కరి మాట వలన సీత రాములు సంవత్సరం పాటు ఏకధాటిగా కన్నీరుమున్నీరు అయ్యారు.
ఆ ఒక్కరి మాట వలన బంగారంతో నిర్మించబడిన నగరం తగలబడిపోయింది.
ఆ ఒక్కరి మాట వలన తమ్ముళ్లు భృత్యులు, మంత్రులు, ప్రజలతో సహా సర్వనాశనం అయిపొయింది లంకానగరం.
అందుకే మనం మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు అలోచించి మాట్లాడాలి.
మాట వలనే స్థాయి పెరుగుతుంది. మాట వలనే స్థాయి కూలిపోతుంది. మాట ముఖ్యం. జన్మకి ఒక సత్యం చెబుతున్నా అని నువ్వు సంతోషించి ఎదుటివారికి ఎలాంటి హాని జరుగుతుందో తెలియక సత్యం చెప్పకూడదు. అబద్దం చెబితే సంతోషిస్తారని అసత్యాలు పలకకూడదు. అలోచించి ఎదుటివారి స్థితి గమనించి సమయానుకూలంగా మాట్లాడడమే ఉత్తమమైన లక్షణం.. ఉత్తముల లక్షణం..

0 comments:

Post a Comment

A call-to-action text Contact us